తన కుమారుడిని ఎత్తుకుని అసెంబ్లీకి వచ్చిన ఢిల్లీ ఎమ్మెల్యే!

  • ఢిల్లీ అసెంబ్లీ వద్ద కనిపించిన దృశ్యం
  • రోహ్‌తస్‌ నగర్ ఎమ్మెల్యే సరితా సింగ్‌కు మూడు నెలల బిడ్డ
  • బిడ్డను ఎత్తుకుని ఆడించిన తోటి ఆప్ ఎమ్మెల్యేలు
ఢిల్లీలోని రోహ్‌తస్‌ నగర్ నియోజ‌క వ‌ర్గ ఎమ్మెల్యే, ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత సరితా సింగ్‌ త‌న బిడ్డ‌ను ఎత్తుకుని అసెంబ్లీకి వ‌చ్చారు. ఆమెకు 2016 ఏప్రిల్‌లో పెళ్లికాగా, గతేడాది నవంబరు 8న మగబిడ్డకు జన్మనిచ్చారు. ఆ బాబుకి అద్వైత్‌ అభినవ్‌ రాయ్ అని పేరు పెట్టారు. ఆ చిన్నారికి ప్రతి రెండు గంటలకోసారి తల్లిపాలు ఇవ్వాలి. దీంతో బిడ్డ‌ను ఇంటివ‌ద్ద వ‌ద‌ల‌లేక స‌ద‌రు ఎమ్మెల్యే తనతో పాటు అసెంబ్లీకి తీసుకొచ్చారు. సరిత అసెంబ్లీకి ఆ బిడ్డ‌ను తీసుకురావ‌డంతో తోటి ఎమ్మెల్యేలు కూడా ఆ బాబుని ఎత్తుకున్నారు. ఈ సంద‌ర్భంగా మీడియాతో స‌రిత మాట్లాడుతూ తమకు మాతృత్వ సెలవులు ఉండవని అన్నారు.
Go Back to Shorts
mla
delhi
Newborn

More Telugu News